దేశంలో ఇప్పుడు బర్డ్ ఫ్లూదే హాట్ టాపిక్. కరోనా మాట అటుంచి ఇప్పుడు అందరూ బర్డ్ ఫ్లూ గురించే మాట్లాడుతున్నారు. అంతగా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ మనకు కూడా వస్తుందా? రాకూడదంటే ఏం చేయాలి? అసలీ టైంలో గుడ్లు, చికెన్ తినడం అంత మంచిదేనా?
మనదేశంలో ఇప్పటికే రెండు రోజుల గ్యాప్ లో 800 కోళ్లు, పక్షులు చనిపోయాయి. మురుంబా అనే గ్రామంలోని కోళ్ల ఫారాల్లో ఏకంగా 8 వేల కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. బర్డ్ ఫ్లూ ఇంతగా సోకుతున్న ఈ టైంలో గుడ్లు, చికెన్ తినడం ఎంత వరకూ సేఫ్? ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే..
ఎలా సోకుతుంది?
ఈ వైరస్ పక్షుల ద్వారా సోకుతుంది. వ్యాధి సోకిన పక్షుల నోటి నుంచి వచ్చే స్రావాల నుంచి ఇది మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే అనారోగ్యంతో ఉన్న పక్షులతో తాకడం లేదా వాటిని తినడం ద్వారా కూడా సోకవచ్చు.
లక్షణాలు ఎలా ఉంటాయి?
బట్టి బర్డ్ ఫ్లూ లక్షణాలు రెండు నుంచి ఏడు రోజులలో స్టార్ట్ అవుతాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, విరేచనాలు, కంటి ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు కనిపించొచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి
ఏం చేయాలి?
బర్డ్ ఫ్లూ మన వరకూ రాకూడదంటే.. పక్షులు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చేతులు తరచూ కడుక్కోవాలి. మాంసాహారం, గుడ్లు వండే ముందు వేడినీటితో శుభ్రంగా కడగాలి.

టెంపరేచర్ 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే.. H5N1 అనే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుంది. కాబట్టి సరిగ్గా వేడి చేసుకుని లేదా బాగా ఉడికించి తినడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండకపోవచ్చు. అయితే పౌల్ట్రీ ఎగ్స్, చికెన్ తెచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మస్ట్.