29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఇంటర్నెట్ స్లో అవుతుందా.. ఇలా చేయండి..

చేతిలో మొబైల్ లేనిదే.. మొబైలో ఇంటర్నెట్ లేనిదే ఏ పనీ అవ్వని రోజులివి. పేరుకైతే డేటా ఉంటుంది. కానీ ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం మనకు కావాల్సినంత ఉండదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే ఏం చేయాలి.
వాట్సాప్ మెసేజ్ ల నుంచి ఆన్ లైన్ పేమెంట్స్ వరకూ అన్ని పనులకీ ఇంటర్నెట్ ఉండడం అవసరం.. అయితే, ఈ ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉంటేనే ఈ పనులన్నీ చక్కబెట్టవచ్చు. స్లో ఉంటే అంతే సంగతి. ఒక్కొక్కసారి ఫోన్ లో 4జీ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఉండదు. అందుకే ఈ సింపుల్ టిప్స్ తో ఇంటర్నెట్ స్పీడ్ ను కొంతవరకూ పెంచొచ్చు.

Social media concept. Like and share social media. Hands holding smartphone with social media network icons. Marketing concept. mobile internet stock pictures, royalty-free photos & images

రీస్టార్ట్ చెయ్యాలి
సిగ్నల్ సరిగ్గా ఉన్నా ఇంటర్నెట్ రాకపోతుంటే.. ఒకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేసి చూడాలి. మొబైల్ రీస్టార్ట్ అయిన తర్వాత మొబైల్.. నెట్ ‌వర్క్ కోసం సెర్చ్ చేస్తుంది. కాబట్టి, ఇంటర్నెట్ వేగం కొంత పెరుగుతుంది.

ఫ్లైట్ మోడ్ ఆన్
మొబైల్‌ను రీస్టార్ట్ చేసే అంత టైం లేకపోతే.. మొబైల్ లో ఒకసారి ఫ్లై మోడ్ లేదా ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేయాలి. ఇలా చేసినప్పుడు కూడా మొబైల్… నెట్ ‌వర్క్‌ కోసం సెర్చ్ చేస్తుంది. దీనివల్ల ఏవైనా కనెక్టివిటీ ఇష్యుస్ ఉంటే సాల్వ్ అవుతాయి.

ఇది చెక్ చేయాలి
మనం వాడే చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ రోజువారీ డేటా లిమిట్ తో పనిచేస్తాయి. ప్లాన్స్ డేటా పరిమితి గడువు ముగిసిన తరువాత ఆటోమెటిక్ గా ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఇలా రోజూ జరుగుతుంటే.. సెట్టింగ్స్ లో డేటా లిమిట్ ను సెట్ చేసుకోవచ్చు. ఏ యాప్ ఎంత డేటా తీసుకుంటుందో చెక్ చేసుకుని వాటికి డేటా లిమిట్ ను సెట్ చేయాలి. అనవసరంగా డేటా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త పడితే లిమిట్ త్వరగా అయిపోకుండా ఉంటుంది.

దీన్ని ఆఫ్ చేయాలి
సాధారణంగా మన మొబైల్ లో యాప్స్ అప్డేట్ అవ్వడానికి ఆటో అప్ డేట్ ఆప్షన్ ఉంటుంది. యాప్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఆటో మెటిక్ గా డౌన్ లోడ్ అయ్యి, అప్ డేట్ అవుతూ ఉంటాయి. దాంతో మనకు తెలియకుండానే డేటా యూజ్ అయిపోతుంది. అందుకే డేటాకు లిమిట్ ఉన్నప్పుడు ఆటో అప్ డేట్ ఆప్షన్ ను ఆఫ్ చేయాలి.

రీసెట్ చేయాలి
మొబైల్ నెట్ వర్క్ తరచుగా స్లో లేదా డిస్ కనెక్ట్ అవుతుంటే.. ఒకసారి మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ ను చెక్ చేసుకోవాలి. 4జీ ఆన్ లో ఉందా.. విఓఏల్ టీఈ ఆన్ లో ఉందా? ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్. ఇవన్నీ ఓ సారి చెక్ చేసుకోవాలి.

రోమింగ్ ఇలా..
ఒక్కోసారి ఇతర రాష్టాలకు వెళ్లినప్పుడు నెట్ ఆగిపోతుంది. సిగ్నల్ ఉంటుంది కానీ నెట్ రాదు. ఒక్కోసారి సిగ్నల్ కూడా రాదు. అలాంటప్పుడు ఒకసారి సిమ్ తీసి మళ్లీ పెట్టాలి. అలాగే రోమింగ్ ఆన్ చేయాలి. ఇలా చేస్తే చాలావరకూ నెట్ వర్క్, ఇంకా కనెక్టివిటీ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి.

- Advertisement -

Latest news

Related news