అయోధ్యలో మసీదు నిర్మాణానికి సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో 5 ఎకరాల్లో నిర్మించే మసీదుకు చందాలు ఇవ్వడం తప్పని.. అలాంటి మసీదులో నమాజ్ చేసినా పాపం అవుతుందని మతపెద్దలు చెబుతున్నారని ఒవైసీ చెప్పారు. అయోధ్యలో కట్టబోయే మసీదు ఇస్లామిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని.. మత పెద్దల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తాను మాట్లాడుతున్నానని ఒవైసీ చెప్పారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుండి ఉలేమాల వరకు అసలు దాన్ని మసీదు అనొద్దని అక్కడ ప్రార్థనలు చేయలేమని చెప్పారన్నారు. దళితులకు తాము మద్దతుగా ఉంటామని, ముస్లింలు ఎవరూ ఎన్నికల్లో వారిపై పోటీ చేయొద్దని సూచించారు. అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో జనవరి 26న మసీదు నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.