కొత్త ప్రాంతాలకు పోయేందుకు గూగుల్ మ్యాప్‌ని వాడుతుంటారు. అయితే గుడ్డిగా గూగుల్ మ్యాప్‌ని వాడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ.. ఏకంగా కారుతో సహా డ్యామ్‌లో పడిపోయిన ఘటన విషాదాన్ని నింపింది.
ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్ కారులో మిత్రులతో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మధ్యలో దారి తప్పడంతో గూగుల్ మ్యాప్‌ను చూడగా.. అది రాంగ్ రూట్ చూపెట్టింది. చీకటిపడినా గూగుల్ మ్యాప్ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనిచ్చాడు..అంతే కారు క్షణాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన కొందరు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, కారులోని సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక, కారులోనే ప్రాణాలొదిలాడు.
మరునాడు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. అక్కడికి కొంతదూరంలో కారును పోలీసులు గుర్తించారు. అందులో సతీష్ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే చెప్పారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందన్నారు.