ఓవైపు కోవిడ్ తీవ్రత తగ్గుతుంటే ..మరోవైపు పెరుగుతున్న కరోనా కొత్త స్ర్టెయిన్ కేసులు భారత్ ను కలవర పెడుతున్నాయి. దేశంలో వేరియంట్ కేసుల సంఖ్య 60 దాటింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య కోటీ నాలుగు లక్షలకు చేరువైంది. కొత్తగా 16వేల 375 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ వైరస్ సోకిన వారి సంఖ్య కోటీ 3లక్షల 56వేల 845 కి చేరింది. గడిచిన 24గంటల్లో 201 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1లక్ష 49వేల 850 కి పెరిగింది. మొత్తానికి కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 99లక్షల 75వేల 958 కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2లక్షల 31వేల 36గా ఉంది.