29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

వ్యాక్సినేష‌న్‌లో ఇండియాకు మూడో స్థానం

కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ఇండియా కంటే ముందు అత్యధిక టీకాలు ఇచ్చిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ దేశాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 57.75 లక్షలమంది కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందులో 53 వేలమందికి హెల్త్ కేర్ వర్కర్లు, 4 లక్షలకు పైగా ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారు. 12 రాష్ట్రాల్లో రెండు లక్షలకుపైగా వ్యాక్సిన్లు వేయగా.. ఒక్క యూపీలోనే దాదాపు 7 లక్షలమందికి వ్యాక్సిన్లు వేశారంది.  ఈ నెల 13  నుంచి దేశ వ్యాప్తంగా రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రాల్లోనే రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. జనవరి 16 నుంచి ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news