ప్రయాణికుల వాహనంలోని ముందు రెండు సీట్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021లో వచ్చే అన్ని మోడళ్ల వాహనాలకు ముందు కూర్చునే ప్రయాణికుల సీట్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ అమర్చాలని సూచించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన కఠినతరం చేస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈ మేరకు పాత వాహనాలు సైతం 2021 జూన్ 1 లోపు ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాలని ఆదేశించింది. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఈ ఎయిర్ బ్యాగ్స్ వల్ల ప్రాణనష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా పలువురు అభిప్రాయపడుతున్నారు.