29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

చరిత్రలో మర్చిపోలేని బడ్జెట్‌లివి..

ఈ రోజు ఎక్కడ చూసినా బడ్జెట్ టాపిక్ ఒక్కటే వినిపిస్తుంది. బడ్జెట్ లు ప్రతీయేటా ప్రవేశపెడుతూనే ఉంటారు. ఈ సారి బడ్జెట్ మాటేమో గానీ.. అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్స్ లో కొన్ని స్పెషల్ బడ్జెట్‌లు ఉన్నాయి. జనానికి ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని స్పెషల్ బడ్జెట్స్ ఏంటంటే..


బ్లాక్ బడ్జెట్
1973-74 టైంలో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ రావ్ చౌహాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను బ్లాక్ బడ్జెట్‌ ఆఫహ ఇండియాగా పిలుస్తారు. ఎందుకంటే.. ఆ టైంలో 550 కోట్లకు పైగా లోటు బడ్జెట్ ఏర్పడింది. 1971లో ఇండియా పాకిస్థాన్ యుద్ధం తర్వాతి బడ్జెట్ అవ్వడం, అందులోనూ పెద్ద మొత్తంలో లోటు ఉండడం వల్ల ఆ బడ్జెట్.. బ్లాక్ బడ్జెట్ గా మిగిలిపోయింది.

లిబరల్ బడ్జెట్
1991లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉదారవాద లేదా లిబరల్ బడ్జెట్ అంటారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ విదేశీ కంపెనీలు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మన దేశానకి ఆహ్వానం పలికారు. ఆ టైంలో బాగా ఉదారవాద విధానాలు ఫాలో అయ్యారు. మన కంపెనీలకు కూడా విదేశాల్లో వ్యాపారం చేసేందుకు వెసులు బాటు ఏర్పడింది. అందుకే దీన్ని లిబరల్ బడ్జెట్ అని పిలుస్తారు.

డ్రీమ్ బడ్జెట్
1997లో పి చిదంబరం ప్రవేశపెట్టి బడ్జెట్‌ను కలల బడ్జెట్‌ గా చెప్తారు. ఈ బడ్జెట్‌లో ఇన్ కమ్ ట్యాక్స్, కంపెనీ ట్యాక్స్ లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 40శాతం ఉన్న ఆదాయపు పన్నును 30 శాతానికి తగ్గించారు. సర్ఛార్జిని కూడా ఎత్తేశారు. ఈ బడ్జెట్ ను జనం సంతోషంగా స్వీకరించారు. అందుకే దీన్ని కలల బడ్జెట్ అంటారు.

రోల్ బ్యాక్ బడ్జెట్
2002లో యశ్వంత్ సిన్హా ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రోల్ బ్యాక్ బడ్జెట్ అంటారు. ఎందుకంటే ఈ బడ్జెట్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ బడ్జెట్‌లో సర్వీస్ టాక్స్, వంటగ్యాస్ సిలెండర్ల ధరను పెంచారు. దీన్ని ప్రతిపక్షాలతో పాటు, సామాన్యులు కూడా వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

- Advertisement -

Latest news

Related news