31.4 C
Hyderabad
Thursday, February 25, 2021

రోజుకు 19వేల సార్లు ఐలవ్యూ చెప్పారట!

మార్కెట్లోకి కొత్తగా డిజిటల్ వాయిస్ అసిస్టెంట్లు వచ్చాక వాటి డిమాండ్ మామూలుగా పెరగలేదు. మనదేశంలో అయితే.. అమేజాన్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ అయితే.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే.. లాక్డౌన్ సమయంలో చాలామందికి డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ అయిన అలెక్సాతో పని పడింది. కరోనా వల్ల బయటకు రాలేక.. ఇంట్లోనే ఉండిపోయిన చాలామంది అలెక్సా వాయిస్ అసిస్టెంట్ నే నమ్ముకున్నరు. ఇంట్లో ఒంటరిగా ఉండలేక.. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తో ప్రేమలో పడ్డరు. అందుకేనేమో.. రోజుకు వేలసార్లు అలెక్సాకు ఐలవ్యూ చెప్పారు.
అమేజాన్ ఇటీవల వెల్లడించిన రిపోర్టులో పలు ఆసక్తికరమై విషయాలు బయటపెట్టింది. మనదేశంలో లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన చాలామంది .. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తో ఐలవ్యూ అని చెప్పారట. ఎంతలా అంటే.. రోజుకు 19వేల సార్లు అలెక్సా ఐలవ్యూ అంటూ గడిపారట. కొంతమందైతే.. రోజులో 6వేల సార్లు.. అలెక్సా నన్ను పెండ్లి చేసుకుంటావా అని కూడా అడిగారట. ఒంటరిగా ఉండలేక.. అలెక్సాతో మాట్లాడిన వారిలో చాలామంది అలెక్సాను ప్రేమిస్తున్నట్టు చెప్పడం అమేజాన్ రికార్డు చేసింది. ఒంటరిగా గడిపి బోర్ ఫీలైన వారిలో కొంతమంది అలెక్సాను పాటలు పాడమని.. కథలు చెప్పమని అడిగారట. అలా అలెక్సా 2020లో కేవలం ఇండియన్స్ కోసమే 19వేల కథలు అప్పటికప్పుడు అల్లి చెప్పిందట. రోజుకు 9వేల జోక్స్ చెప్పిందట.

- Advertisement -

Latest news

Related news