29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఇండియాస్ స్లీప్ ఛాలెంజ్.. నిద్రపోయినందుకు లక్షల్లో ప్రైజ్

ఏమీ చేయకుండా రోజుకి తొమ్మిది గంటలు నిద్రపోతే చాలు.. లక్ష రూపాయలిస్తాం అంటే ఎవరైనా కాదంటారా.. అచ్చంగా ఇలాంటి జాబే ఆఫర్ చేస్తోంది.బెంగళూరుకి చెందిన వేక్ ఫిట్ కంపెనీ..
రోజుల తరబడి నిద్రపోయే సత్తా ఉంటే చాలు ఉద్యోగం లభించినట్టే.. అదేంటీ.. నిద్రపోవడం కూడా ఓ పనేనా? అన్న డౌట్ రావొచ్చు చాలామందికి. కానీ సీరియస్ గా నిద్రపోవడం కూడా ఒక సీరియస్ జాబ్ తో సమానం అంటున్నారు వేక్ ఫిట్ సంస్థ ఫౌండర్లు.
బెంగళూరుకి చెందిన వేక్ ఫిట్ సంస్థ నిద్రను ఇష్టపడుతూ.. బాగా నిద్రపోయే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్లీపింగ్ ఛాలెంజ్ లో ఇంటర్న్‌షిప్ చేసే వారికి లక్ష రూపాయలు, చాలెంజెస్ అన్నీ క్లియర్ చేసి ‘ఇండియాస్ స్లీప్ చాంపియన్’ గా నిలిచిన వారికి పది లక్షలు ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది.

ఎందుకంటే..
వేక్‌ఫిట్ సంస్థ పిల్లోస్, కంఫర్టర్స్, మ్యాట్రిసెస్ లాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. వినియోగదారులకు బెటర్ స్లీప్ అందించడమే ఈ కంపెనీ లక్ష్యం. అందుకే నిద్రపోయేందుకు ఈ ప్రొడక్ట్స్ ఎంతవరకూ తోడ్పడుతున్నాయి. ఇంకా ఆయా ప్రొడక్ట్స్ లో ఎలాంటి మార్పులు చేయాలి లాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఈ చాలెంజ్ కొంత వరకూ ఉపయోగపడొచ్చు. అలాగే స్లీప్ ఛాలెంజ్ ద్వారా నిద్ర అనేది ఎంత ముఖ్యమైన విషయమో చెప్పేందుకే ఈ చాలెంజ్ నిర్వహిస్తున్నట్లు వేక్‌ఫిట్ కంపెనీ డైరెక్టర్, కో ఫౌండర్ చైతన్య రామలింగ గౌడ చెప్పారు.

గెలిస్తే పది లక్షలు
గతేడాది కూడా స్లీపింగ్ చాలెంజ్‌ను నిర్వహించిన వేక్‌ఫిట్.. దానికి కొనసాగింపుగానే ఈ ఏడాది రెండో ఎడిషన్ ను నిర్వహిస్తోంది. స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థులు వేక్‌ఫిట్ మ్యాట్రిసెస్‌లో వంద రోజుల పాటు రోజూ తొమ్మిది గంటల పాటు నిద్రించాలి. అభ్యర్థులు ఎన్ని గంటలు నిద్రిస్తున్నారో స్లీప్ ట్రాకర్ ద్వారా తెలుసుకుంటారు. సెలెక్టెడ్ ఇంటర్న్స్ అందరికీ లక్ష రూపాయలు అందిస్తారు. అలాగే ఫైనల్ విజేతగా గెలిచిన వారికి పది లక్షలు ఇస్తారు.

- Advertisement -

Latest news

Related news