29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రేపటి వరకు ఇంటర్నెట్ బంద్

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో రేపు రాత్రి 11 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీసులపై సస్పెన్షన్ విధించింది. రైతులు ఆందోళన చేస్తున్న గాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రైతులు చేస్తున్న ఆందోళనలు, ఉద్యమానికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రసరామవుతున్నాయి. ఈ క్రమంలో రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతున్నది. రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ, ప్రసార మంత్రిత్వ శాఖ ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నటు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news