మధ్యాహ్నం తిన్న తర్వాత తీరిగ్గా అలా ఓ కునుకు తీయడం చాలామందికి అలవాటు. వర్క్ చేసే వాళ్లు కూడా లంచ్ తర్వాత ఒక పవర్ న్యాప్ తీసుకుంటారు. ఇంతకీ అలా పడుకోవడం మంచిదా? కాదా?
మధ్యాహ్నం నిద్రపోతే బద్ధకం వేస్తుందని.. అలా పడుకోకూడదని చాలామంది అంటుంటారు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ స్టడీ.. మధ్యాహ్నం నిద్ర వల్ల ప్రశాంతంగా, షార్ప్ గా ఉండొచ్చని చెప్తోంది.
60ఏళ్ల కంటే పైబడిన 2వేల 214మందిపై నిర్వహించిన స్టడీలో మధ్యాహ్నం పడుకునే వారు ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉన్నట్టు తేలింది. ఈ విషయం జనరల్ సైకియాట్రి జర్నల్ లో కూడా పబ్లిష్ అయింది. డే టైంలో ఓసారి కునుకు తీసే వారి బ్రెయిన్ ఓవర్ లోడ్ నుంచి రికవరీ అవుతుందట. అలా ఒకసారి నిద్రపోయి లేస్తే మెదడులో గందరగోళం తగ్గి, మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. యాంగ్జైటీ, స్ట్రెస్, మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. అందుకే లంచ్ చేసిన తర్వాత కాసేపు అలా ఓ కునుకు తీయమంటున్నారు నిపుణులు.