23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

వాటికి రీరిజిస్ట్రేషన్ కష్టమే..

పొల్యూషన్, యాక్సిడెంట్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం.. 15 ఏండ్లు దాటిన టూ వీలర్స్​, ఫోర్​ వీలర్స్, ట్రక్కులు, బస్సులకు రీరిజిస్ట్రేషన్ చేయొద్దని భావిస్తుందట. లైఫ్​ టైమ్​ అయిపోయిన వెహికల్స్​ను స్ర్కాప్​కు అమ్ముకుంటే కొత్త వెహికల్స్​ కొనుగోళ్లపై రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వెహికల్​ స్క్రాపేజీ పాలసీని తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ప్రకటించారు. ఎలక్ట్రికల్​ వెహికల్స్​ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో 2.5 కోట్లకు పైగా కాలంచెల్లిన వెహికల్స్​ ఉన్నట్లు అంచనా. పాత వాహనాలను స్క్రాప్‌ చేసే విధానాన్ని కేంద్రం 2019లో నోటిఫై చేసింది. 

- Advertisement -

Latest news

Related news