29.3 C
Hyderabad
Monday, March 1, 2021

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : కేటీఆర్

తెలంగాణ విద్యుత్ కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని.. మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నుంచి తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘంలో చేరిన పలువురు నేతలను అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అనుభవించిన అందరూ.. నేడు తెలంగాణ విద్యుత్ వెలుగులు చూసి నివ్వెరపోతున్నారని కేటీఆర్ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో సమక్షంలో ప్రకటించిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభు్త్వం మీద విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

Latest news

Related news