29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మూగ జీవాలను హింసిస్తే జైలుకే..

ఇటీవల కేరళలో గర్భంతో ఉన్న ఒక ఏనుగుకు బాంబులతో కూడిన పండ్లను తినిపించగా పేలుడు తీవ్రతకు ఆ ఏనుగు చనిపోయిన విషయం తెలిసిందే. ఇలానే మూగ జీవాలను హింసించిన పలు సంఘటనలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇలా జంతువులను హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. మూగజీవాలపై దాడులు, క్రూర చర్యలకు పాల్పడే వారికి నేర తీవ్రతను బట్టి 5 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.75 వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇందుకోసం 60 సంవత్సరాల నాటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించనున్నది. జంతువులపై హింసకు పాల్పడే వారికి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.100 జరిమానా మాత్రమే విధించే అవకాశం ఉంది.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను పార్లమెంట్ లో ప్రస్తావించారు. జంతువులపై హింస, క్రూరత్వాన్ని నిరోధించడానికి ప్రస్తుత చట్టాన్ని సవరించాలని కోరారు. దీనికి స్పందించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్.. జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం 1960ను సవరించి మరింత కఠినమైన జరిమానాలు, శిక్షలు విధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జంతువులపై క్రూరత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో 316 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారు.

- Advertisement -

Latest news

Related news