29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

టెస్ట్,ఇంటర్వ్యూ లేవు.. టెన్త్ పాసయితే చాలు

ముంబై జోన్ లో ఉండే సెంట్రల్ రైల్వే.. 2532 అప్రెంటీస్ జాబ్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 5 వరకూ వీటికి దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే వీటికి ఎలాంటి ఎగ్జామ్స్, ఇంటర్వూలు ఉండవు. కేవలం టెన్త్, ఇంటర్ లేదా ఐటిఐ మార్కుల ఆధారంగానే సెలెక్షన్ జరుగుతుంది.
ఈ జాబ్స్ కు అప్లై చేయాలంటే 10+2 విధానంలో ఏదైనా కోర్సు పూర్తి చేసి ఉండాలి. అందులో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎన్‏టీవీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ళ లోపు ఉండాలి. టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆపై ఎలాంటి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలు ఉండవు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్ పూర్, భుసావల్, షోలాపూర్ డివిజన్లలలో పనిచేయాల్సి ఉంటుంది. వివరాల కోసం https://www.rrccr.com/ వెబ్‏సైట్ ను సంప్రదించండి.

- Advertisement -

Latest news

Related news