విడుదలైన 24 గంటల్లోనే 140 మిలియన్ల వ్యూస్ సాధించిన కేజీఎఫ్ సినిమా టీజర్ మీద కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టీజర్ లో హీరో యష్ పొగ తాగే సీన్లు తొలగించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ, యాంటీ టొబాకో సెల్ చిత్రబృందానికి, హీరో యష్ కి నోటీసులు జారీ చేసింది.
టీజర్లో యష్ పొగ తాగే సీన్స్, టొబాకో 2003 చట్టంలోని సెక్షన్ 5 నిబంధనల అతిక్రమణ కిందకు వస్తాయని యాంటీ టొబాకో సెల్ చెప్పింది. టీజర్ లోని పొగతాగే సీన్లు, పోస్టర్లు వెంటనే తీసేయాలని చిత్ర యూనిట్ కు ఆదేశాలు జారీ చేసింది.
హీరో యష్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. అందులో యువత అధికంగా ఉన్నారని.. యష్ ని చూసి యువత స్టైల్ గా తనలా పొగ తాగేందుకు ప్రేరేపించబడే అవకాశముందని కర్ణాటక ఆరోగ్య శాఖ నోటీసులో తెలిపింది. హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గాందర్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు సర్కారు నోటీసులు పంపింది.