21.2 C
Hyderabad
Monday, January 18, 2021

బ్రిటన్ లో కొత్త వైరస్.. అప్రమత్తమైన కర్ణాటక

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగుచూడటంతో ప్రపంచంలోని పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి. మనదేశంలో కూడా ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ర్టాలు సైతం కొత్త వైరస్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందా అని వణికిపోతున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో క‌ర్ణాట‌క రాష్ర్ట ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంది. ఈ కర్ఫ్యూ జ‌న‌వ‌రి 2వర‌కు అమ‌ల‌వుతుంద‌ని క‌ర్ణాట‌క సీఎం యెడియూర‌ప్ప తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి అందరూ స‌హ‌క‌రించాల‌ని సీఎం కోరారు. 

విదేశీ ప్రయాణికుల‌పై దృష్టి

కొత్త వైర‌స్ నేప‌థ్యంలో క‌ర్ణాట‌కకు వ‌చ్చే అంత‌ర్జాతీయ ప్రయాణికుల‌పై దృష్టి సారించామ‌ని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాక‌ర్ తెలిపారు. కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వ్యాపించకుండా రాష్ర్టంలో నైట్ క‌ర్ఫ్యూ విధించామ‌ని పేర్కొన్నారు. నేటి నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు రాత్రిళ్లు ఎలాంటి వేడుకలకు అనుమ‌తులు లేవని ఆయన తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...