32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు. ఎర్రకోటపైకి ఎక్కిన రైతుల అక్కడే బైటాయించారు. జై భారత్.. అంటూ నినాదాలు చేస్తూ జెండాలు ప్రదర్శిస్తున్నారు. వారిని తిరిగి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీలోని ఐటీఓ సమీపంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా సంస్థ కు చెందిన బస్సులను రైతులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు రైతుల ట్రాక్టర్లు ముందుకు కదలకుండా ట్రాక్టర్ల టైర్ల గాలిని పోలీసులు తీసేసారు. దాంతో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఈ ర్యాలీకి ఢిల్లీ చుట్టుపక్కల మూడు మార్గాల్లో పోలీసులు అనుమతించగా.. పలు చోట్ల రైతుల ట్రాక్టర్లు ముందుకు కదలకుండా పోలీసులు బారికేడ్లను ఉంచడంతో, రైతులు తొలగించి మరీ ర్యాలీని ముందుకు సాగించారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

Latest news

Related news