సంక్రాంతి సీజన్ వచ్చిందంటే.. ఆకాశమంతా రంగురంగుల పతంగిలతో నిండిపోతుంది. పతంగిలన్నీ ఆకాశాన్ని అందుకునేలా పైపైకి ఎగురుతుంటాయి. పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తూ మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఇంత ఆనందాన్ని నింపుతున్న ఈ పంతగు అసలు ఎక్కడ పుట్టిందో తెలుసా.. దీనికీ ఓ చరిత్ర ఉంది. అదేంటంటే

పతంగిలు ఎగురవేసే ట్రెడిషన్ మనది కాదు. ఈ సంస్కృతి విదేశాల నుంచి మనకు వచ్చింది. పంతగుకి సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటిసారిగా గాలిపటం అనే కాన్సెప్ట్ చైనాలో డిజైన్ అయింది. సుమారు 2300 సంవత్సరాల క్రితం, టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో చైనా మిలటరీ విభాగాల అధికారులకు, ప్రస్తుతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులను తెలియజేసేందుకు, సూచనలు ఇచ్చేందుకు గాలి పటాలను ఉపయోగించే వారట. దాంతో పాటు వీటికి బాంబులను కట్టి శత్రు స్థావరాలపై పడేలా కూడా చేసేవారట. అలా చైనాలో మొదలైన పతంగిల ప్రస్తానం రానురాను అన్ని దేశాలకు వ్యాపించింది. అలా 14వ శతాబ్దానికి ఇండియాకు వచ్చింది. జనవరి సీజన్ లో గాలిలో తేమ, పొడి శాతం తక్కువగా ఉండడం వల్ల గాలిపటాలు నిలకడగా ఎగురుతాయి. అందుకే సంక్రాంతి వేడుకల్లో భాగంగా పతంగిలు కూడా వచ్చి చేరాయి. ఇదీ పతంగి హిస్టరీ.