తమిళనాడు గవర్నర్గా ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజును కేంద్రం నియమించినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన రాకపోయిన ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
2016లో రోశయ్య తర్వాత ఇప్పటి వరకూ తమిళనాడుకు గవర్నర్ ని నియమించలేదు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు కూడా గవర్నర్గా వ్యవహారిస్తున్నారు. 1990ల్లో బీజేపీలో చేరిన కృష్ణంరాజు.. 12, 13వ లోక్సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2000 నుంచి 2002 వరకూ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.