26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆపరేషన్స్ అధిపతి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి జైలు శిక్ష ఖరారైంది. పాకిస్థాన్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆ దేశ మీడియా శుక్రవారం తెలిపింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై ఆరు రోజుల కిందట లఖ్వీని పాక్ ఉగ్రవాద వ్యతిరేక పోలీస్ విభాగం (సీటీడీ) గత శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
2008 ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు.