29.3 C
Hyderabad
Monday, March 1, 2021

చిరుత సంచారం.. అధికారుల అప్రమత్తం

శ‌ంషాబాద్ ఎయిర్‌పోర్టు ప‌రిస‌రాల్లో చిరుత సంచ‌రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి ర‌న్ వేపై 10 నిమిషాల పాటు చిరుత పులి సంచారం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ త‌ర్వాత చిరుత‌.. ర‌షీద్‌గూడ వైపు గోడ దూకి ప‌రుగులు తీసింది.

పులి సంచారిస్తున్న వీడియో గమనించిన ఎయిర్‌పోర్టు భ‌ద్రతా అధికారులు అప్రమ‌త్తమ‌య్యారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు. ర‌షీద్‌గూడ గ్రామ‌స్తులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చిరుత ఆచూకీ కోసం అట‌వీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news