29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

అగ్రిసెస్ తో మద్యం ధరలు పెరగవట

పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్ ఇలా పలు దిగుమతి చేసుకునే వస్తువులపై కేంద్రం తాజా బడ్జెట్ లో ‘అగ్రిసెస్’‌ను ప్రతిపాదించారు. ముఖ్యంగా మద్యంపై 100 శాతం అగ్రి సెస్‌ను ప్రతిపాదించడంతో మద్యం బాబులు షాక్ గురయ్యారు. అయితే తాజాగా అగ్రిసెస్ తో మద్యం ధరలు పెరుగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంపోర్టెడ్ మద్యంపై ఇప్పటివరకు 150 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్న కేంద్రం.. దాన్ని 50 శాతానికి తగ్గించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, అగ్రి సెసె కలిపినా తిరిగి 150 శాతానికే సమానం అవుతుందని కేంద్రం చెబుతుంది. మద్యం ద్వారా కేంద్రానికి అధిక ఆదాయం అందుతుంది. ఈ కారణంగానే మద్యాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఇచ్చారు.

- Advertisement -

Latest news

Related news