29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఏకంగా ఐదు రైళ్లను కలిపి..

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవ‌స్థల్లో మన ఇండియన్ రైల్వే ఒక‌టి. అయితే రీసెంట్ గా ఇండియన్ రైల్వే ఓ కొత్త రికార్డు నెల‌కొల్పింది. అదేంటంటే..
ఇండియన్ రైల్వే కొత్తగా ప్రయోగం చేస్తూ.. ఏకంగా 295 వేగ‌న్లతో ఐదు రైళ్లను అనుసంధానించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 3.5 కిలోమీటర్లుండే ఈ రైలుకు ‘వాసుకి’ అని పేరు పెట్టారు.ఈ సరుకు రవాణా వాసుకి రైలును ఛత్తీస్‌గడ్‌లోని భిలై నుంచి కోర్బా వరకు నడుస్తుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య సుమారు 224 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. ఈ రైలుని ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక గార్డు సాయంతో నడిపారు. పారిశ్రామిక ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయడానికి ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది. గ‌తంలో 177 వేగ‌న్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి న‌డిపారు. దీని పేరు ‘సూప‌ర్ అన‌కొండ’. ఇది బిలాస్ పూర్ నుంచి చక్రధర్ పూర్ డివిజన్ల మీదుగా వెళ్లేది.

- Advertisement -

Latest news

Related news