29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రైతు నేతలపై లుక్ ఔట్ నోటీసులు

కిసాన్ ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద ఈ నెల 26 న జరిగిన ఘటనలకు సంబంధించి 20 మందికి పైగా రైతు నేతలపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వారు దేశం దాటి వెళ్లకుండా వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారి వివరాలను ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులకు పంపినట్లు సమాచారం.

తాజాగా పంజాబీ నటుడు దీప్ సిద్దు, సోషల్ యాక్టివిస్ట్ గా మారిన గ్యాంగ్ స్టర్ లఖా సిధానా పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన అల్లర్లను వీరు ప్రేరేపించారని ప్రాథమిక నివేదికల్లో ఆరోపించారు. ఎర్రకోట వద్ద జరిగిన ఆస్తి నష్టాన్నిఆర్కియలాజికల్ సర్వే సంస్థ లెక్కకట్టి కేంద్రానికి నివేదిక సమర్పించింది.

- Advertisement -

Latest news

Related news