22.9 C
Hyderabad
Sunday, January 17, 2021

ఇకపై వారానికోసారి గ్యాస్ ధరల సవరింపు.. త్వరలో అధికారిక ప్రకటన

ఇకపై ప్రతి వారం ఎల్పీజీ సిలిండర్ ధరను సవరించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం నెలకోసారి గ్యాస్ సిలిండర్ ధరలు సవరణ జరగుతుండగా.. వచ్చే ఏడాది నుంచి వారానికోసారి సవరణలు చేయాలని నిర్ణయించారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో వస్తున్న మార్పుల దృష్ట్యా ధరల్లో మార్పులు చేయనున్నట్టు ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను రోజూ మారుస్తుండ‌టం వ‌ల్ల వాటి న‌ష్టాల నుంచి కంపెనీలు గ‌ట్టెక్కాయి. ఇప్పుడు సిలిండ‌ర్‌ను కూడా వారం రోజుల‌కు ఓసారి స‌వ‌రించి త‌మ న‌ష్టాల‌ను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నాయి. అయితే.. పెట్రోల్, డీజిల్ మాదిరిగానే ఎల్పీజీ ధరలు కూడా సామాన్యుడికి భారం కానున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆల్రెడీ అమలవుతున్నాయి

ఇప్పటికే  విధానాన్ని గ్యాస్ కంపెనీలు అమ‌లు చేస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ నెలలో  ఇప్పటికే రెండుసార్లు ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే దీనికి నిద‌ర్శనం. డిసెంబ‌ర్ 2న స‌బ్సిడీ సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెర‌గ‌గా.. డిసెంబ‌ర్ 15న మ‌రోసారి రూ.50 పెరిగింది. ఇప్పుడు వారానికోసారి ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తే.. సిలిండ‌ర్ బండ మ‌రింత భారంగా మార‌డం ఖాయం. పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా ప్రభుత్వం స‌బ్సిడీని కూడా పెంచుతుందా లేదా అనేది తేలాల్సిన విషయం.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...