మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఈ కేసులో అలేఖ్య, సాయి దివ్యలను హత్య చేసినట్లు వారి నిందితులు ఒప్పుకున్నారని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. హత్య చేసి.. పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ వారింకా ఆధ్యాత్మికత అనే ట్రాన్స్ నుంచి బయటకు రాలేదని.. మానసికంగా వారి పరిస్థితి బాగలేదని ఆయన తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం వారిని పోలీసులు మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. హత్యలకు సంబంధించిన సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నామనే వార్తల్లో నిజం లేదని.. డీఎస్పీ మనోహరాచారి అన్నారు. కేసును లోతుగా అధ్యయనం చేస్తున్నామని.. ఆధారాలను బట్టి వాస్తవాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
