32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

బెంగాల్ అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోయేలా దీదీ మార్కు రాజకీయం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ చరిత్రలో నిలిచిపోయేలా సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ను ఆహ్వానించకుండానే, గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీలో దీదీ బడ్జెట్‌-2021ను ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. గవర్నర్‌ను ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ సభ్యులు, సీపీఎం , కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. తర్వాత సభ బయట బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆర్థిక శాఖను తన వద్ద ఉంచుకున్న సీఎం మమత రూ.2.99 కోట్ల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌లో దీదీ పలు వర్గాలకు వరాలిచ్చారు. క్రిషక్ బంధు పథకం భత్యాన్ని, రైతు బంధు వార్షిక సహాయాన్ని దీదీ పెంచింది. రూ.1500 కోట్లతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 20 లక్షల పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ.10 కోట్ల వ్యయంతో కోల్‌కతా పోలీస్ ఫోర్స్ లో నేతాజీ బెటాలియన్ ఏర్పాటు, రూ.100 కోట్లతో పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించే పథకం ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news