29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

పెండ్లి వేడుకలో స్టెప్పులేసిన దీదీ!

నిత్యం ఆవేశంతో ఊగిపోయే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా కూల్ కూల్ గా కనిపించారు. అలీపుర్దార్ జిల్లా ఫలకటాలో గిరిజన యువతులతో కలిసి ఆమె ఉత్సాహంగా స్టెప్పులేశారు. నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ.. ప్రత్యర్థులను తన స్పీచ్ తో హడలెత్తించే దీదీ నవ్వుతూ స్టెప్పులేయడం అందరినీ ఆకట్టుకుంది. ఫలకటాలో ఓ ఎన్జీవో నిర్వహించిన సామూహిక పెండ్లి వేడుకలో పాల్గొన్న ఆమె.. అక్కడి గిరిజన యువతులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. డ్రమ్ బీట్ కి తగ్గట్టుగా స్టెప్పులేస్తూ.. అందరిలో ఉత్సాహం నింపారు.

ఆ తర్వాత జరిగిన మరో కార్యక్రమంలో కూడా దీదీ చాలా కూల్ గా నవ్వుతూ, ఉత్సాహంగా కనిపించారు. ఎన్నికల సమయంలో దీదీ ఇంత కూల్ గా కనిపించడం పట్ల రాజకీయ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ పార్టీ గెలిచి తీరుతుందన్న ధీమా మమతా బెనర్జీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందంటున్నారు.

- Advertisement -

Latest news

Related news