29.3 C
Hyderabad
Monday, March 1, 2021

రూ.5 కోట్లిస్తే మోదీని చంపుతానని ఆఫర్.. వ్యక్తి అరెస్టు

ఎవరైనా తనకు రూ.5 కోట్లు ఇస్తే పీఎం మోదీని చంపుతానని ఫేస్‌బుక్‌లో ఓపెన్ ఆఫర్‌ ప్రకటించిన సత్యానందం(43) అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఫేస్‌బుక్‌లో సత్యానందం అఫర్ ను చూసిన ఓ ట్యాక్సి డ్రైవర్‌ గురువారం పోలీసులు సమాచారం అందించాడు. ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ను ట్రేస్‌ చేసిన పోలీసులు పుదుచ్చేరికి సమీపంలో అతన్ని అరెస్టు చేశారు. ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడం, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో ఐపీసీ సెక్షన్లు 505(1), 505(2) కింద నిందితుడిపై కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Latest news

Related news