25.6 C
Hyderabad
Friday, January 15, 2021

సిద్ధిపేట కీర్తి దేశం మొత్తానికి తెలియాలి : మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా కీర్తి దేశం నలుమూలల వ్యాపించేందుకు ఈ ప్రాంతం బిడ్డలందరూ కృషి చేయాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చడానికి అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. మహానగరాలకు ధీటుగా సిద్దిపేట పట్టణ అభివృద్ధి జరుగుతుందని హరీష్ తెలిపారు. భారత ప్రభుత్వం చెత్తరహిత పట్టణాలు, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండే పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇస్తుందని.. ఈ ఏడాది ఆ అవార్డు సిద్ధిపేటకే రావాలని.. ఆ దిశగా అందరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాకేంద్రంలో కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ఆయన.. ప్రజల మధ్య ఐక్యతను ప్రజల్లో అవగాహన పెంచడానికి స్వచ్ఛ పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట కీర్తి కూడా పతంగిలా దేశం మొత్తం కనపడాలన్నారు. సిద్దిపేటలో ఇప్పటికే బహిరంగ మలవిసర్జన లేదని.. త్వరలో జిల్లాలోని అన్ని గ్రామాలు కూడా బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా మార్చుకుందామన్నారు. సిద్ధిపేట మున్సిపాలిటీకి సలహాలు ఇవ్వాలన్నా, ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నా.. 1969కి ఫోన్ చేయాలని కోరారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...