ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేసి మీడియాతో మాట్లాడకుండా చూడాలని డీజీపీని తాజాగా నిమ్మగడ్డ ఆదేశించడం సంచలనంగా మారింది. దీనిపై ఈ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రిని గృహ నిర్బంధంలో పెట్టడం దుర్మార్గమైన ఆలోచనని, దేశంలోనే పెద్ద అధికారిలా నిమ్మగడ్డ ఫీలవుతున్నారని.. అఫ్ట్రాల్ ఆయనో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాత్రమే అన్నారు. రాష్ట్రంలో నిమ్మగడ్డలా నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరూ లేరని, నిమ్మగడ్డలా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలోశాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని డీజీపీకి రాసిన లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించారు.