భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని అయితే దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే మాత్రం సైన్యం చూస్తూ ఊరుకోదని, తగినరీతిలో జవాబు చెప్తుందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఏ సూపర్ పవర్ అయినా భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ధీటుగా జవాబు చెప్పేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నరని పరోక్షంగా చైనాను ఉద్దేశించి మాట్లాడారు. బెంగళూరులో జరిగిన ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలతో భారత్ ఎల్లప్పుడూ శాంతియుత సంబంధాలే కోరుకుంటుందని చెప్పారు. అది భారత్ రక్తం, సంస్కృతిలోనే ఉందన్నారు. లఢక్‌లో సైనికులు దేశం గర్వించేలా ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.