23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

టీం వర్క్ లేకనే అవి విఫలం.. ఎమ్మెల్సీ కవిత

అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అవినీతిరహిత విధానాలు తెచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. అశోక యూనివర్సిటీ, వీ-హబ్ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో ఆమె ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ లాంటి భవిష్యత్ టెక్నాలజీలపై జాతీయస్థాయిలో ప్రత్యేక విధానం ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. స్టార్టప్‌లు సక్సెస్ కావాలంటే ఆలోచనతోపాటు, టీం వర్క్‌ కూడా చాలా ముఖ్యమని కవిత అన్నారు. దేశంలో 90 శాతం స్టార్టప్‌లు టీం వర్క్‌ లేకనే విఫలమవుతున్నాయని ఓ సర్వేలో తేలిందని ఆమె గుర్తుచేశారు.

తెలంగాణలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీలో 33 శాతం పదవులు, షీటీంలు, ప్రత్యేక విద్యా సంస్థలు, వితంతు పింఛన్లు అందించి మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని కవిత చెప్పారు.

- Advertisement -

Latest news

Related news