29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మోదీ తలపాగా వెరీ స్పెషల్.. ఎవరిచ్చారంటే..

భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా(టర్బన్) అందర్నీ విశేషంగా ఆకర్షించింది. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను.. ఆ తరువాత కూడా మోదీ ఈ తలపాగాను దరించే ఉన్నారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘హలారీ పగ్డీ’గా ప్రచారంలో ఉన్న  ఈ తలపాగాను జామ్ నగర్ రాయల్ ఫ్యామిలీ ప్రత్యేకంగా మోదీ కోసం రూపొందించింది. ఈ స్పెషల్ టర్బన్ ని గుజరాత్ లోని జామ్ నగర్ కి చెందిన రాయల్ ఫ్యామిలీ గిఫ్ట్ గా ఇచ్చిందట. గత ఏడాది రిపబ్లిక్ డే నాడు మోదీ కాషాయ రంగు టర్బన్ ధరించి కనిపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news