29.3 C
Hyderabad
Monday, March 1, 2021

రాజ్యసభలో మోదీ ఎమోషనల్

రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగుస్తున్న నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గురించి మాట్లాడుతూ.. మోదీ ఎమోషనల్ అయ్యారు.
“గులాంనబీ ఆజాద్‌ నాకు మించి మిత్రుడు.. నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు మాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది.. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతారు. ఉద్యానవనాల విషయంలో ఆయనకు అపార జ్ఞానం ఉంది. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి నేర్చుకోచ్చు” అని మోదీ అన్నారు.
ప్రధాని మాట్లాడుతున్నంత సేపూ గులామ్ నబీ ఆజాద్ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ కనిపించారు. అలాగే షంశేర్ సింగ్ మన్హాస్ గురించి మాట్లాడిన మోదీ, “నా ప్రసంగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి.. నేను ఆయనతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మా పార్టీ బలోపేతానికి ఆయనతో కలసి స్కూటర్ పై ప్రయాణించిన రోజులు నా మదిలో ఇంకా మెదులుతున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నేను ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను” అన్నారు. అలా నజీర్ అహ్మద్ లావే, మొహమ్మద్ ఫయాజ్ ల సేవలను కూడా ప్రధాని ప్రస్తావించారు.

- Advertisement -

Latest news

Related news