29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

మోదీ స్పీచ్ హైలెట్స్‌

దేశ వ్యాప్తంగా ఈరోజు కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఉదయం గం. 10.30 కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. మోదీ స్పీచ్‌లో హైలెట్స్ ఇవే..


వ్యాక్సినేషన్ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వ్యాక్సిన్‌ కోసం శ్రమించినవారికి అభినందనలు తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్, నర్సులు, డాక్టర్లు, వ్యాక్సిన్ పొందడానికి తొలి హక్కు దారులని అన్నారు. మొదటి దశలో వీరికిచ్చే వ్యాక్సిన్‌లు ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది అన్నారు. వ్యాక్సిన్ తయారీలో మన దేశ శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఈ రోజు కోసమే ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నానని అన్నారు.

టీకా ప్రక్రియ గురించి మాట్లాడుతూ.. “టీకా ఎప్పుడు ఎవరికి అందిస్తామన్న విషయం ముందుగానే తెలియజేస్తాం. వ్యాక్సిన్ రెండు డోసులు ఖచ్చితంగా వేసుకోవాలి. రెండు డోసుల మధ్య నెల రోజుల టైం పడుతుంది. సెకండ్ డోసు వేసుకున్న తర్వాతే శరీరంలో వ్యాధి నిరోదక శక్తి పెరుగుతుంది. టీకా వేసుకున్న తర్వాత కూడా మాస్క్, సామాజిక దూరం పాటించాల్సిందే. ప్రపంచంలో వందకు పైగా దేశాల్లో 3 కోట్లకంటే తక్కువ జనాభా ఉంది. కానీ భారత్‌లో మొదటి దశలోనే 3 కోట్ల మందికి టీకా ఇస్తున్నాం. రెండో దశలో 30 కోట్ల మందికి టీకాలు అందిస్తాం” అన్నారు.


గురజాడను గుర్తుచేస్తూ..

“వ్యాక్సిన్‌ పై వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. భారత్ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా 60శాతం మంది పిల్లలకు ఇస్తున్నారు. భారత్ వ్యాక్సిన్‌ల పై ప్రపంచమంతా నమ్మకముంది. పైగా ఇతర దేశాల వ్యాక్సిన్ కంటే మన వ్యాక్సిన్లు చాలా చౌక. సమస్య ఎంత పెద్దదైనా మనం ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. మొన్నటివరకూ మాస్క్‌లు, పీపీఈ కిట్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు అన్నీ మన దేశంలోనే తయారవుతున్నాయి” అని చెప్తూ.. “సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడ్పడవోయ్.. దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్.. తెలుగులో మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు పరుల కోసం మనందరం పాటుపడాలి” అని మహాకవి గురజాడను గుర్తుచేశారు.


మన పోరాటం ఆదర్శం
“కరోనా సమయంలో హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తమ కుటుంబాలను వదిలి ప్రజలకోసం పనిచేశారు. కొందరైతే పనిచేస్తూ చనిపోయారు కూడా. కరోనాపై పోరాడుతూ ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వారందరికీ శ్రద్ధాంజలి. కరోనా వల్ల భారత్‌ తీవ్రంగా నష్టపోతుందని ప్రపంచమంతా భావించింది. ఇంత జనాభా ఉన్న భారత్‌ కరోనాను ఎలా తట్టుకుంటుందని అనుకున్నారు. అయితే తొలి కరోనా కేసు నమోదు అవ్వడానికి రెండు వారాల ముందే హైలెవల్ కమిటీని ఏర్పాటు చేశాం. 2020, జనవరి 17న కరోనాపై తొలి అడ్వైజర్ జారీ చేశాం. కరోనాపై భారత్ చేసిన పోరాటం రాబోయే తరాలకు ఆదర్శం. జనతా కర్ఫ్యూతో ప్రజలు లాక్‌డౌన్‌కు మానసికంగా సిద్ధమయ్యారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వందే భారత్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న 35 లక్షల మంది పౌరులను స్వదేశానికి తీసుకొచ్చాం” అని అన్నారు.

- Advertisement -

Latest news

Related news