29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

A అంటే ఎవరో చెప్పేసిన మోనాల్ గజ్జర్

బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్ ని ఉద్ధేశించి నాగార్జున.. నీ మనసులో ఉన్నది A కదా అన్నప్పుడు మోనాల మెలికలు తిరుగుతూ.. సిగ్గుపపడిపోయింది. అయితే.. అందరూ A అంటే అఖిల్ అని, అభిజిత్ అనుకున్నారు. అయితే.. A అంటే అఖిల్, అభిజిత్ ఇద్దరూ కాదని.. వేరే వ్యక్తి అని మోనాల్ కుండ బద్దలు కొట్టేసింది.

తెలుగులో ఐదారు సినిమాలు చేసిన మోనాల్‌ గజ్జర్‌కి సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రం తరువాత మోనాల్ గజ్జర్ తెలుగు సినిమాల్లో చేయడం మానేసింది. సొంత రాష్ట్రం గుజరాత్‌కి వెళ్లిపోయి.. అక్కడ మళ్లీ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. అయితే తెలుగులో ఆఫర్స్ వస్తున్నప్పటికీ 2015 తరువాత మోనాల్ సౌత్ ఇండస్ట్రీని వదిలేయడానికి ఓ బలమైన కారణం ఉంది.


తన ప్రియుడితో ఐదేళ్లు పాటు డేటింగ్‌లో ఉన్న మోనాల్.. అతనితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో సౌత్‌లో సినిమాలు చేయొద్దని డిసైడ్ అయ్యింది. ఇంతకీ తన ప్రియుడు ఎవరు? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందన్న దానిపై ఓపెన్ గా చెప్పేసింది మోనాల్. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్నాళ్లూ తన మనసులో ఉన్నది A అని చెప్పిన మోనాల్.. కొన్నాళ్లు A అంటూ అభిజిత్ అని.. మరికొన్నాళ్లు అఖిల్ అని అందరూ చెప్పుకున్నా తాను మాత్రం సైలెంట్ గా ఉండేది. ఒక దశలో A అంటే యాపిల్ అని అఖిల్, అభిల పేర్లు చెప్పకుండా దాటవేసింది. అయితే తాజాగా A అంటే ఆర్యన్ అనీ.. అతను నా మాజీ ప్రియుడు అని చెప్పకనే చెప్పింది. ఆర్యన్ గురించి చెప్తూ.. ‘‘సుడిగాడు’ సినిమా తరువాత నాకు మలయాళం ఆఫర్ వచ్చింది. 2013లో తమిళ్ ఆఫర్స్ వచ్చాయి. 2014 వరకూ తమిళ్‌లో సినిమాలు చేశా. ఆ తరువాత 2015లో మళ్లీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా 2016లో రిలీజ్ అయ్యింది. ఆ టైంలో నేను ఆర్యన్ తో రిలేషన్ షిప్‌లో ఉన్నాను. కొన్నేళ్ల తర్వాత 2016లో బ్రేకప్ అయ్యింది. ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం వల్ల నేను మళ్లీ గుజరాత్ వెళ్లిపోయి.. అక్కడ గుజరాతీ సినిమాలు చేసుకున్నా అని చెప్పింది.

రిలేషన్ షిఫ్ బ్రేక్ కావడం వల్ల తెలుగులోకి రావడం ఇష్టం లేక ఇక్కడ సినిమాలు చేయలేదు. ఆ రిలేషన్ షిప్ వల్ల నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. తెలుగులో హీరోయిన్‌గా సినిమాలు చేసినా.. గుజరాతీలో సినిమా ఆఫర్స్ కోసం మళ్లీ ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. చూడ్డానికి నేను గుజరాతీ అమ్మాయిలా ఉండను.. సౌత్ అమ్మాయిలా కనిపిస్తాను. అందుకే గుజరాతీలో సినిమాల కోసం కష్టపడాల్సి వచ్చింది’ అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది మోనాల్.

ఇంతకీ ఆర్యన్ ఎవరు?

మోనాల్ గజ్జర్ మాజీ ప్రియుడు మలయాళ హీరో. ఇద్దరూ కలిసి 2012లో డ్రాకులా అనే మలయాళ త్రీడీ సినిమాలో నటించారు. ఇదే సినిమాను తెలుగులో పున్నమిరాత్రిగా తీశారు. ఈ సినిమా 2016లో తెలుగులో విడుదలైంది. శ్రద్ధాదాస్, సుధీర్ సుకుమారన్, ఆర్యన్, ప్రభు, నాజర్ తదితరులు నటించారు.

- Advertisement -

Latest news

Related news