22.9 C
Hyderabad
Sunday, January 17, 2021

పెద్ద తెర మీదే చూడాలి.. అందుకే ఆపుతున్నారు

ఒక సీన్మ షూటింగ్ అయిపోగానే.. ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని హడావుడి చేస్తరు నిర్మాతలు. మరో దిక్కు ప్రేక్షకులు కూడా తమ ఫేవరెట్ హీరో సీన్మలు రిలీజ్ అయితున్నయంటే చాలు.. థియేటర్ల ముందు, బుకింగ్ కౌంటర్ల ముందు బారులు తీరుతరు. అయితే.. కరోనా అలాంటి దృశ్యాలన్నింటినీ ఎరేజర్ పెట్టి చెరిపేసినంత పని చేసింది. కరోనా, లాక్ డౌన్ పుణ్యమా అని చాలా  సినిమాలు ఇప్పటికే అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్ లాంటి ఓటీటీలలో రిలీజ్ చేశారు. అయితే.. పెద్ద తెర మీదే విడుదల చేద్దామని ఆపిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇంత కష్టపడి తీసి.. ఓటీటీల మీద కాకుండా ప్రేక్షకులకు పెద్ద తెర మీదే చూపిద్దామని కొందరు నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

పాటలతో ఎగసిన ఉప్పెన..!

‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందులో పడవ ప్రయాణం’ అంటూ పాటతోనే సినిమాపై పాజిటివ్ టాక్ క్రియేట్ చేసిన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ తీసిన సినిమా ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 2020 మే నెలలోనే విడుదల కావాల్సింది. కానీ.. లాక్ డౌన్, కరోనా వల్ల సినిమా విడుదల చేయలేదు. ఓటీటీ కంపెనీలు ఈ చిత్రాన్ని తమ ఫ్లాట్ ఫామ్ మీద విడుదల చేయడానికి భారీ మొత్తంలో ఆఫర్ చేశాయి. కానీ మెగా మేనల్లుడి తొలిచిత్రం కావడంతో అభిమానుల ఈలల, గోలలు మిస్‌ కాకూడదని మెగాస్టార్ తిరస్కరించినట్టున్నారు. అప్పటికే యూట్యూబ్‌లో విడుదల చేసిన లిరికల్‌ సాంగ్స్‌కు సంగీత ప్రియులు ఫిదా అయ్యారు. మెల్లమెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్న తరుణంలో ‘ఉప్పెన’ను ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

ఇస్మార్ట్‌ శంకర్‌.. డబల్ దిమాక్ అంటూ మాస్ ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టేసిన రామ్ 2020లో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. వెంటనే మరో మంచి మాస్ అండ్ క్లాస్ లుక్ తో తీసిన రెడ్ సినిమా విడుదలకు మాత్రం కరోనా బ్రేక్ వేసింది. తమిళ సినిమా తడమ్ కు ఇది రిమేక్. దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమా తెరకెక్కించాడు. ఇందులో రామ్ తొలిసారి డ్యుయల్ రోల్ పోషించాడు. అయితే రామ్ ఎనర్జీకి కరోనా, లాక్‌డౌన్‌ బ్రేకులు వేసింది. ఓటీటీలో ఈ సినిమా రానుందని పుకార్లు వచ్చినా నిర్మాత స్రవంతి రవికిషోర్‌ అదంతా అబద్ధమని చెరప్రు. 2021 సంక్రాంతికి థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించారు.

తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో దళపతి విజయ్. ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ తో విజయ్ మాస్టర్ అనే చిత్రం రూపొందించారు. దులో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. ఇద్దరు మంచి నటులు కావడంతో సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. పాటలు, టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అన్ని ఓటీటీలు ఈ సినిమాను కొనేందుకు ట్రై చేశాయి. కానీ.. విజయ్ అభిమానులు మాత్రం తమ అభిమాన మీరో సినిమా థియేటర్లోనే ఆడాలని కోరుతున్నారు. నిర్మాతలు కూడా ఈ సంక్రాంతికి థియేటర్లో సినిమా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మరో తెలుగు హీరో దగ్గుబాటి రానా. బాహుబలి సినిమాతో తన నటనా చాతుర్యమేంటో చూపించాడు. మూస కథల జోలికి పోకుండా ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ మన బాధ్యత అని తెలిపే కథాంశంతో అరణ్య అనే సినిమా రూపొందించారు. దీనికి ప్రభు సాల్మన్ దర్శకులు. పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలనుకుంటున్న  ఈ సినిమాను దక్కించుకోవడానికి ట్రై చేశాయి. కానీ.. చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం అరణ్య సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని ఫిక్సయింది.

క్రికెట్ చరిత్రలో టీమిండియాది సువర్ణక్షరాలతో రాయదగ్గ ప్రస్థానం. భారత క్రికెట్ ను ఆ స్థాయిలో నిలిపిన కపిల్ డెవిల్స్ 1983లో కప్పు సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ క్రికెట్ పవర్ చూపించారు. అయితే.. 1983 వరల్డ్ కప్ ప్రయాణాన్ని తెర చూపించే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమా 83. రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా ఇప్పటికే పూర్తయింది. 2020 వేసవిలో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. ఓటీటీ జోలికి అస్సలు పోమంటున్న ప్రొడ్యుసర్లు జనవరి 22న ప్రేక్షకులను థియేటర్లో కలుస్తాం అంటున్నారు.

స్పీడుగా సినిమాలు తీస్తూ.. నిత్యం ప్రేక్షకులతో టచ్ లో ఉండే అక్షయ్ కుమార్ ఈ సారి  సూర్యవంశీ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. లాక్ డౌన్ కంటే ముందే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. కరోనా, లాక్ డైన్ దెబ్బకు అక్షయ్ కుమార్ కూడా సినిమా సినిమాకు మధ్య  భౌతిక దూరం పాటించక తప్పలేదు. సూపర్‌హీరోల సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన రోహిత్‌శెట్టి దర్శకత్వంలో  తీసిన సూర్యవంశీ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. అధికారికంగా విడుదల తేది ఇంకా ప్రకటించకపోయినా..  కొత్త సంవత్సరం జనవరి, మార్చి నెలల మధ్య సిమా విడుదల చేయొచ్చంటున్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...