32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

లోగో పై కంప్లెయింట్.. వెంటనే మార్చేసిన మింత్రా

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా మింత్రా మీమ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఫ్యాషన్ ఈ కామర్స్ బ్రాండ్ అయిన మింత్రా రీసెంట్ గా లోగో మార్చింది. పాత లోగో చూడ్డానికి అసభ్యకరంగా ఉందని ఒకామె కంప్లెయింట్ చేయడంతో.. మింత్రా లోగోను మార్చాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే…


ఆడువారి మనోభావాలు దెబ్బతీసేలా మింత్రా లోగో ఉందంటూ ఆ సంస్థ ఓ సామాజిక కార్యకర్త కోర్టు మెట్లెక్కింది. దాంతో లోగోను పరిశీలించిన ప్రభుత్వం లోగోను మార్చాలని ఆదేశించింది.
అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ 2020 డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు మింత్రా లోగోపై ఫిర్యాదు చేశారు. మింత్రా లోగో ఆడువారిని కించ పరిచేలా అభ్యంతరకరమైన భంగిమలో ఉందని ఆమె ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మింత్రా లోగో నిజంగానే మహిళలను కించపరిచేలా ఉందని నిర్ధారించుకుని, సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీచేశారు. నెలలోపే లోగోను మార్చేస్తామని మింత్రా వారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం లోగోను మార్చేశారు. అయితే ఆమె కంప్లెయింట్ చేసే వరకూ మింత్రా లోగో.. అసభ్యకరమైన పోశ్చర్ ను పోలి ఉన్నట్టు ఎవరూ అంతగా నోటీస్ చేయలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

Latest news

Related news