శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా ఈ సినిమా రానుంది. నారప్పగా వెంటకేశ్, సుందరమ్మగా ప్రియమణి పాత్రలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండిపోతాయంటున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన నారప్ప ఫ్యామిలీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్తగా నారప్పలో కనిపించాడు. పోస్టర్ లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం నారప్ప పెద్ద కొడుకుగా నటిస్తున్నాడు.ఇప్పటివరకు విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను రోజురోజుకీ పెంచేస్తున్నాయి. ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్లో చెప్పేసింది చిత్ర యూనిట్. సమ్మర్ లో తెలుగు ప్రేక్షకుల చప్పట్ల నడుమ నారప్ప సూపర్ హిట్ అందుకుంటాడు అంటున్నారు సినీ విశ్లేషకులు.
