29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది. చట్టాలపై చర్చించేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య బుధవారం పదో విడత చర్చలు జరిగాయి. ఐదు గంటలపాటు సాగిన ఈ చర్చల కొత్త సాగు చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనలను రైతు సంఘాల ముందు ఉంచింది. అయితే రైతు నాయకులు ఈ ప్రతిపాదనను వెంటనే అంగీకరించలేదు. అంతర్గత సంప్రదింపుల అనంతరం తమ అభిప్రాయం వెల్లడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో జనవరి 22న మరోసారి భేటీ కావాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.

- Advertisement -

Latest news

Related news