28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

ఢిల్లీలో ఎల్లుండి అర్ధరాత్రి వరకు కర్ఫ్యూ

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్‌ సర్కారు నైట్‌ కర్ఫ్యూ ప్రకటించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు, అలాగే జనవరి ఒకటిన రాత్రి 11 నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ సమయంలో బహిరంగ సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా బ్రిటన్‌ వైరస్‌ కేసులు నమోదైన నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం బుధవారం రాష్ట్రాలను కోరింది.

యూకే నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తుల్లో నలుగురికి కొత్త వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. వారిని ఐసోలేషన్ వార్డులకు పంపించి ఢిల్లీ ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ప్రభుత్వం ఢిల్లీలోని నాలుగు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రద్దీని అరికట్టేందుకు నూతన సంవత్సర వేడుకలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. గత మూడున్నర నెలలుగా దేశంలో క్రియాశీల కేసుల సంఖ్యల క్రమంగా తగ్గుతోందని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు.

- Advertisement -

Latest news

Related news

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...