ఒక యోధుని వీరత్వం తెలియాలంటే ప్రత్యర్థి కూడా బలమైనోడే అయి ఉండాలి. నటుడి ప్రతిభ బయటపడాలంటే.. కథలో బలం ఉండాలి. ఈ విషయం తెలుగు సినీ చరిత్రలో చాలామంది నటులు చాలాసార్లు నిరూపించారు. తమ టాలెంట్ కు తగ్గ క్యారెక్టర్ పడితే.. రెచ్చిపోయి బాక్సాఫీసలు బద్దలు కొట్టేశారు. మొన్నటి మొన్న జై లవకుశ సినిమాతో త్రిపాత్రభినయం చేసి తన నటనా చాతుర్యాన్ని చాటిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరోసారి వెండితెరకు తన నటనతో పండుగ తెస్తున్నాడు.
హీరో ఎవరైనా.. ఓ రేంజులో చూపించే దర్శక దిగ్గజం కావాల్సినంత స్టఫ్ ఉన్న నటులు దొరికితే ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో బాహుబలి, మగధీర, యమదొంగ లాంటి సినిమాల్లో తేలిపోయింది. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ నటిస్తున్న రామ్ పాత్రను ఇప్పటికే పరిచయం చేశాడు. ఈ మధ్యకాలంలో విడుదల చేసిన ఎన్టీఆర్ పాత్ర భీం యూట్యూబ్ ని షేక్ చేస్తున్నది. యూట్యూబ్‌లో కొమురం భీం ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. ఊహించనన్ని వ్యూస్, లైక్స్‌తో పాటు అద్దిరిపోయే కామెంట్లు వచ్చాయి. ఎన్టీఆర్ భీం టీజర్‌కు దాదాపు ఐదు లక్షలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోలో మాకు ఎన్టీఆర్ కనిపించలేదు.. గోండు నాయకుడు కొమురం భీం కనిపించాడు అంటూ అభిమానులు, సినీ ప్రేమికులు ఎన్టీఆర్ మీద అభినందనలు కురిపించారు. ఇప్పటికైతే తక్కువ సమయంలో భారీ వ్యూస్, కామెంట్లు దక్కించుకున్న భీం టీజర్ మరెన్ని రికార్డులు ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.