32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

పాత వందనోట్లు చెల్లవు. ఎప్పటి నుంచి అంటే..

ఇప్పుడు చలామణిలో ఉన్న పాత వంద రూపాయల నోట్లు, పది, ఐదు రూపాయల నోట్లు కూడా త్వరలో అప్‌డేట్ అవ్వబోతున్నాయి. ఏప్రిల్ చివరిలోగా వీటిని ఉపసంహరించబోతున్నారు.


పాత వందరూపాయల నోట్లలో నకిలీ నోట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే వీటిని ఉపసంహరించబోతున్నట్టు ఆర్బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మహేశ్‌ చెప్పారు. అయితే లావెండర్ రంగులో ఉండే కొత్త వందరూపాయల నోట్లు ఎప్పటిలాగే చెల్లుబాటు అవుతాయి.
పదిరూపాయల నాణేన్ని ప్రవేశపెట్టి 15 ఏళ్లు దాటినా ఇప్పటికీ దాన్ని ఎవరూ అంతగా స్వీకరించడం లేదని మహేశ్ అన్నారు. దాంతో ఆ నాణేలు చెస్టుల్లో భారీగా పేరుకుపోయి సమస్యగా పరిణమించాయన్నారు. పది రూపాయల నాణేలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి వినియోగాన్ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేయాలని ఆయన చెప్పారు.


ప్రస్తుతం మనదేశంలో రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటితో పాటు 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేల కూడా చలామణిలో ఉంచిన ఆర్బీఐ.. రీసెంట్‌గా రూ.20 నాణేన్ని కూడా ప్రవేశపెట్టింది.


రిజర్వు బ్యాంక్‌ నివేదిక ప్రకారం.. గతేడాది మార్చి చివరి నాటికి మొత్తం బ్యాంకు నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువ 83.4 శాతానికి పెరిగింది. అలాగే రూ.10, రూ.100 నోట్ల వాడకం కొంత తగ్గింది.

- Advertisement -

Latest news

Related news