గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకొని సామన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయి. తాజాగా సబ్సిడీ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.184 పెంచాయి. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. గతేడాది డిసెంబర్లోనే చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలు పెంచిన విషయం తెలిసిందే. రెండు నెలల వ్యవధిలోనే రెండు సార్లు గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి.
తాజాగా పెంచిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.771.50, ఢిల్లీలో రూ.719, లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722గా ఉన్నాయి.