ఇండియా–పాక్ అంతర్జాతీయ సరిహద్దులో మరో భారీ సొరంగం బయటపడింది. జమ్మూ కశ్మీర్లో ని హిర్నాగర్ సెక్టార్లో ఉన్న బోబి యాన్ గ్రామంలో ఈ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. రెండు నుంచి మూడు అడుగల వ్యాసంతో ఉన్న సొరంగం దాదాపు 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉంది. పాక్ గడ్డపైనుంచి ఇండియాలోకి 150 మీటర్ల పొడవున సొరంగం ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఐజీ ఎన్ఎస్ జంవాల్ చెప్పారు. సొరంగం అటువైపు పాక్ ఉగ్రవాద బేస్ క్యాంపులు ఉండొచ్చన్నారు. సొరంగంలో కొన్ని ఇసుక పాకెట్లు దొరికాయని, దొరికిన ఇసుక సంచులపై ఉన్న తయారీ తేదీలను బట్టి సొరంగాన్ని 2016–17లో తవ్వినట్టు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న సాంబ, కతువా జిల్లాల్లో గత ఆరు నెలల్లో వెలుగు చూసిన మూడో సొరంగం అని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు.