జయలలిత వారసురాలిని తానే అంటూ శశికళ ప్రకటించిన నేపథ్యంలో.. తమిళనాట రాజకీయాలు హీటెక్కుతున్నాయి. శశికళ వర్గానికి చెక్ పెట్టే దిశగా అన్నాడీఎంకే నేతలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా చిన్నమ్మకు తమిళనాడు సీఎం పళని స్వామి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన కొందరు పార్టీని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీని నాశనం చేసేందుకు విష శక్తులు కుట్రలు చేస్తున్నాయని పరోక్షంగా శశికళపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి పార్టీ నుంచి తొలగించిన వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వారి ఆటలు సాగవని పళని స్వామి అన్నారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయన్నారు.