23.2 C
Hyderabad
Friday, January 15, 2021

కరోనా సాకుతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత

కరోనా సాకుతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాల వ్యతిరేకతకు భయపడే నిర్ణయం తీసుకున్నాయని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కరోనా తీవ్రస్థాయిలో విజృభిస్తున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పలు బిల్లులు పాస్ చేసిన మోడీ ప్రభుత్వం.. ఇప్పుడెందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడానికి భయపడుతోంది అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు వ్యవసాయ బిల్లుల రద్దుకై ప్రభుత్వం మీద విరుచుకుపడతాయన్న భయంతో కరోనా సాకు చూపించి పార్లమెంట్ సమావేశాలు రద్దు చేశారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా పేరుతో పార్లమెంట్ సమావేశాలు రద్దు చేసిన మోడీకి ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా? కరోనా వ్యాప్తి జరుగుతుందని తెలిసినా.. బడులు, గుడులు, బార్లు తెరిచారు. బహిరంగ సభలు, ఎన్నికలు నిర్వహించారు. ప్రచారాలు చేసుకున్నారు. కానీ.. ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు వినడానికి, చర్చించడానికి మాత్రం కరోనా అడ్డొస్తుందా అని మేధావులు, యువత, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...